న్యూస్‌రీల్
అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టిన అధికార పార్టీ నాయకులు కలెక్టర్ ఆదేశాలతో తవ్వకాలను అడ్డుకున్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
బాపట్ల
గురువారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2026
తమ్ముళ్ల దోపిడీకి
అక్రమార్జనకే మట్టి తవ్వకాలు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
తెనాలి రూరల్: మండలంలోని సంగం జాగర్లమూడి పీహెచ్‌సీని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గవర్నమెంట్ జనరల్ హాస్పటల్‌లో 106 మంది కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు బుధవారం అందజేశారు. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) 150 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 7వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఆర్డీ కార్యాలయం అధికారులు దరఖాస్తులు పరిశీలించి సీనియార్టీ, ప్రతిభ ఆధారంగా 150 మంది అభ్యర్థులను ఎంపిక చేసి గురువారం కౌన్సెలింగ్‌కు పిలిచారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం, గతంలో పనిచేసిన నియామకపు ఉత్తర్వుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు పరిశీలించి 106 మందికి ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు అందజేశారు. కౌన్సెలింగ్‌కు పిలిచిన వారిలో 26 మంది గైర్హాజరు కాగా, ఆరుగురు డిజేబుల్డ్ కోటాలో దరఖాస్తు చేయడంతో వారి సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం సంబంధిత ఆసుపత్రులకు పంపించారు. స్పోర్ట్స్ కోటాలో ఐదు పోస్టులకు ఎవరూ అభ్యర్థులు హాజరు కాలేదు. నూతనంగా నియామకపు ఉత్తర్వులు అందుకున్న కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి, నూతనంగా ప్రారంభమవుతున్న పిడుగురాళ్ల జీజీహెచ్‌కు మంచి పేరు తీసుకు రావాలని రోగుల మన్ననలు పొందాలని ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి సూచించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో డెప్యూటీ డైరెక్టర్ బండి పాల్‌సుధాకర్, సూపరింటెండెంట్‌లు విజయకుమార్, సత్యం, సీనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, సురేష్, శ్యామ్‌అనిల్, గ్రాబియేల్, తదితరులు పాల్గొన్నారు.
కర్లపాలెం: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులు జేబులు నింపుకొనేందుకు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. కర్లపాలెం మండల పరిధిలోని సమ్మెటవారిపాలెం తాగునీటి చెరువుపై కన్నేసిన కొందరు నాయకులు మట్టి తవ్వి విక్రయించుకునేందుకు పథకం రచించారు. ఈ నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి తాగునీటి చెరువుకు మరమ్మతులు చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. ప్రభుత్వ అనుమతులు రాకముందే చెరువులోని మట్టిని తవ్వి విక్రయించేందుకు పూనుకోవటంతో గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరెడ్డి, గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వచ్చి మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు.
మూడు వేల మందికి తాగునీటి వనరు
సమ్మెటవారిపాలెం గ్రామంలో సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణం పరిధిలో తాగునీటి చెరువు ఉంది. ఈ చెరువు పరిధిలో సమ్మెటవారిపాలెం, శీలంవారిపాలెం, పేరలి కొత్తపాలెం గ్రామాలలోని సుమారు 3 వేల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. గత 15 ఏళ్లుగా ముగ్గురు సర్పంచ్‌లు తాగునీటి చెరువును కాలువ నీటితో నింపి గ్రామప్రజలకు నీరందిస్తున్నారు. తాగునీటి చెరువులోని మట్టిని తవ్వి విక్రయించుకుని జేబులు నింపుకొనేందుకు టీడీపీ నాయకులు అధికారులపై మరమ్మతులకు అనుమతులివ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఉపాధి హామీ కూలీలతో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
యంత్రాలతో తవ్వకాలు
చెరువులో మట్టి తవ్వి విక్రయించుకునేందుకు కర్లపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు ఎస్‌కే బాజీ జేసీబీతో పనులు చేపట్టారు. సుమారు పది టిప్పర్ల వరకు మట్టి తరలించినట్లు సమ్మెటవారిపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరమ్మతుల కోసం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈ పనులు చేపట్టటంతో మాజీ సర్పంచ్ సమ్మెట వెంకటేశ్వరరెడ్డి ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెరువు వద్దకు వచ్చి మట్టి తవ్వకాలను నిలిపివేశారు.
అనుమతులు లేవు
తాగునీటి చెరువుకు యంత్రాలతో మరమ్మతులు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఎం.అనంతరాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఈ సమ్మెటవారిపాలెం చెరువును పరిశీలించారు. యంత్రాలతో తవ్వేందుకు అనుమతి ఎవరు ఇచ్చారని అక్కడే ఉన్న టీడీపీ మండల అధ్యక్షుడు ఎస్‌కే బాజీని ఆయన ప్రశ్నించారు. తక్షణం తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏఈ మంజూర్ బాషా మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీలతో చెరువులో జమ్ము తొలగించి కట్టలపై ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసి పటిష్ట పరిచేందుకు ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని ఆయన తెలిపారు. అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఈ పేర్కొన్నారు.
టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి అనంతరాజు
7


