యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్
బాపట్లటౌన్: ప్రతి రోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం సూర్యలంక రోడ్డులోని నగర వనంలో డీఆర్‌ఓ.జి.గంగాధర్‌గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ, నోడల్ ఆఫీసర్ చంద్రశేఖర్, డి ఎఫ్‌ఓ రవిశంకర్‌లతో కలసి యోగా గురువు చిత్ర పటానికి పూలమాలలు వేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నగర వనంలో మంచి వాతావరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎక్కువ మంది యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళనలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వ్యాయామం మాత్రమే కాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంద్ర కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని అన్నారు. యోగా దినోత్సవం కార్యక్రమాలలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


