బొల్లాపల్లి: ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బొల్లాపల్లి మండలం బండ్లమోటు – రేమిడిచర్ల గ్రామాల మధ్య ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో కొండబోయిన నాగేశ్వరరావు (45) మృతి చెందాడు. భార్య గోవిందమ్మ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుంది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సరికొండపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. రావులాపురం గ్రామానికి చెందిన గొంగటి హుస్సేన్‌రెడ్డి ద్విచక్రవాహనంపై వినుకొండ నుంచి స్వగ్రామం వెళుతున్నాడు. మార్గంమధ్యలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండెబోయిన నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన గోవిందమ్మను చికిత్స నిమిత్తం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్ల మోటు ఎస్సై ఎస్‌డీ సమీర్ బాషా తెలిపారు.
భర్త మృతి– భార్యకు తీవ్ర గాయాలు


