గుండె చెరువు | - | Sakshi
Sakshi News home page

గుండె చెరువు

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026 చెరువుల గర్భానికి యథేచ్ఛగా తూట్లు బ్యాంకర్లు సహకరించాలి నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు మైనింగ్‌శాఖకు సంబంధం లేదు న్యాయవాది హత్య కేసులో వీడిన మిస్టరీ

న్యూస్‌రీల్‌

ఇస్టానుసారంగా తవ్వకాలతో పెద్ద పెద్ద గోతులు ఆందోళనలో ఆయా గ్రామాల ప్రజలు చెరుకుపల్లి మండలంలో ఇస్టానుసారంగా చెరువు మట్టి తరలింపు రూ.లక్షలు గడిస్తున్న అధికార పార్టీ నేతలు పట్టించుకోని అధికారులు

బాపట్ల
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026
చెరువుల గర్భానికి యథేచ్ఛగా తూట్లు
బ్యాంకర్లు సహకరించాలి

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,200, గరిష్ట ధర రూ.3,000, మోడల్‌ ధర రూ.2,000 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

చెరుకుపల్లి: మండలంలో చెరువుల్లో ఇంజిన్లు పెట్టి మరీ నీటిని తోడేసి చెరువును ఖాళీ చేసి, మట్టిని యథేచ్ఛగా తరలించుకుకెళుతూ రూ.లక్షలు వెనుకేసుకుంటున్నారు అక్రమార్కులు. ముఖ్యంగా చెరుకుపల్లి మండలంలోని ఆరుంబాక గ్రామంలో ఉన్న చావలివారి చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా అమృతలూరు మండలం గోవాడకు చెందిన అధికార పార్టీ నేత, ఇంటూరుకు చెందిన మరో వ్యక్తి, అదేవిధంగా మండలంలో ప్రతి గ్రామానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున అధికార పార్టీ నేతలు సిండికేటై అక్రమంగా మట్టి తవ్వి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలోనూ మండలంలోని చావల వారి చెరువులో వందల సంఖ్యలో డంపర్ల దారా మట్టిని తవ్వి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులకు అమ్ముకుని రూ.లక్షలు గడించారు. అదే గ్రామ పంచాయతీ పరిధిలోనే ఏమినేని వారి పాలెం గ్రామం వద్ద ఉన్న సుమారు 10 ఎకరాలు విస్తీర్ణం ఉన్న దేవర చెరువులో మట్టిని తరలించేందుకు రంగం సిద్ధం చేసి ప్రస్తుతం రెండు భారీ పొక్లెయిన్ల సాయంతో డంపర్లు, ట్రాక్టర్‌ ల ద్వారా రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తూ దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ కు రూ.2వేల నుంచి రూ3వేలు, ట్రక్కుకు రూ.10వేల నుంచి రూ15వేల వరకు వసూలు చేస్తున్నారు.

పట్టీపట్టనట్లు అధికారులు

మట్టి తవ్వకాలకు గనుల శాఖతోపాటు రెవెన్యూ, పంచాయతీ అనుమతి తీసుకోవాలి అయితే అవేమి మాకు అవసరం లేదంటూ మండలంలో అక్రమార్కులు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. ఆరుంబాక దేవర చెరువులో మట్టిని తీసేందుకు ఏకంగా 20అడుగుల లోతు పెట్టి అక్రమంగా మట్టిని తరలిస్తున్నా పంచాయతీ అధికారులు గానీ రెవెన్యూ, పోలీస్‌, చివరకు మైనింగ్‌ అధికారులు కూడా తొంగి చూడకుండా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ప్రమాదభరితంగా...

మండలంలో కొన్ని చెరువుల్లో యంత్రాల సాయంతో మట్టి తీయటంలో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వాటిని కనీసం సరిచేయకుండా అందిన వరకు మట్టి తీసుకొని వదిలేస్తున్నారు. వర్షాకాలం చెరువులు నిండి, గుంతల్లో మనుషులు గానీ, పశువులు గానీ పడితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

బాపట్లటౌన్‌: జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్‌ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశం హాల్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలన్నారు. జిల్లాలో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి రంగాలకు బ్యాంకులు అధిక ప్రాధాన్యతనిస్తూ రుణాల పంపిణీ చేపట్టాలన్నారు. ప్రాధాన్యతా రంగాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. రైతులకు పంట రుణాలు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు అనుసంధానం, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బ్యాంకుల వారీగా పనితీరును నివేదికల మేరకు సమీక్షించి, లక్ష్యాల సాధనలో వెనుకబడిన బ్యాంకు మేనేజర్లకు పలు సూచనలు చేశారు. రుణ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో టూరిజం దినదినాభివృద్ధి చెందుతుందని టూరిజంలో బ్యాంకులు పెట్టుబడులకు ఇది సరైన సమయమన్నారు. జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన క్రెడిట్‌ ప్లాన్‌, వివిధ రంగాలకు అందించిన రుణాలు, డిపాజిట్లు, రుణాల, డిపాజిట్ల నిష్పత్తి, ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు పురోగతి తదితర అంశాలను వివరించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సింగయ్య, వ్యవసాయ శాఖ జేడీ ఈ లక్ష్మి, జిల్లా పశుసంవర్ధక అధికారి వేణుగోపాల్‌, పరిశ్రమలు మేనేజర్‌ రామకృష్ణ, మత్స్యశాఖ ఉపసంచాలకులు గాలి దేవుడు, మెప్మా పీడీ ఆనంద పాల్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శివకృష్ణ, యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, ఆర్‌బీఐ ఎండీఓ ఎలమంద, నాబార్డ్‌ డీడీఎం రవికుమార్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల జిల్లా సమన్వయకర్తలు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. శనివారం కలెక్టర్‌ బంగ్లా నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఓటర్ల జాబితా సవరణపై ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు సమన్వయం చేసుకొని ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఈఆర్వోలు, ఏఈ ఆర్‌వోలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

మలేరియా రహిత సమాజస్థాపనకు కృషిచేయాలి

మలేరియా రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం పోస్టర్‌లు, ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్‌ శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మలేరియా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని చెప్పారు. మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు.

మండలంలో ఎక్కడా జలధార పథకం ద్వారా ఎవరికీ ఎలువంటి అనుమతులు ఇవ్వలేదు. ఎక్కడైనా జలధార పథకం ద్వారా మట్టి తవ్వకాలు జరిపితే వెంటనే ఉన్నతాధికారుల ద్వారా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఆరుంబాక దేవర చెరువులో తవ్వేందుకు ఎటువంటి అనుమతులు లేవు.

– కళ్యాణ్‌, ఏఈ, కూచిపూడి చానల్‌ డ్రైనేజ్‌

చెరువులో మట్టిని జలధార పథకం ద్వారానే ఇరిగేషన్‌, డ్రైనేజ్‌ అధికారులు అనుమతులు ఇస్తారు. మైనింగ్‌శాఖకు సంబంధం లేదు. అయితే ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలిస్తే వారిపై శాఖా పరంగా చర్యలు తీసుకొని యంత్రాలు, వాహనాలు సీజ్‌ చేస్తాం.

– శ్రీనివాస్‌, మైనింగ్‌ ఏడీ, బాపట్ల జిల్లా

చేనేత నాయకుడిపై దాడి

9

జిల్లా అభివృద్ధికి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement