ఫిజియోస్‌ క్రికెట్‌ లీగ్‌–2026 విజేత ‘హంగ్రీ చీతాస్‌’ | - | Sakshi
Sakshi News home page

ఫిజియోస్‌ క్రికెట్‌ లీగ్‌–2026 విజేత ‘హంగ్రీ చీతాస్‌’

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

గుంటూరు మెడికల్‌: ఆంధ్ర ఫిజియోస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ అమరావతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు డాక్టర్స్‌ స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌, ఎంఎస్‌కే క్రికెట్‌ గ్రౌండ్స్‌లలో నిర్వహించిన ‘ఫిజియోస్‌ క్రికెట్‌ లీగ్‌–2026’ టీ–20 క్రికెట్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. పది టీములు డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో పాల్గొనగా హంగ్రీ చీతాస్‌ గుంటూరు టీం విన్నర్స్‌గా నిలిచి రూ.లక్ష నగదు రోలింగ్‌ షీల్డ్‌, వైజాగ్‌ మార్వెల్‌ ఫిజియో క్రికెట్‌ క్లబ్‌ రన్నర్స్‌గా రన్నర్స్‌ షీల్డ్‌ రూ.50 వేల నగదు పారితోషికం అందుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ యార్లగడ్డ రవితేజ మాట్లాడుతూ క్రీడలు దేశభక్తి, జాతీయ సమైక్యత, విశాలమైన ఆలోచనలకు ప్రతిబింబంగా ఉండాలన్నారు. ఆంధ్ర ఫిజియోస్‌ క్లబ్‌ అమరావతి అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ బి.నాగ సతీష్‌ కుమార్‌, మహమ్మద్‌ ఇమ్రాన్‌ మాట్లాడుతూ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్స్‌ విజయవంతం కావటంలో స్పోర్ట్స్‌ క్లబ్‌ కమిటీ కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్స్‌లకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిత్వేద లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ, విన్నర్స్‌ ప్రైస్‌ షీల్డ్‌ స్పాన్సర్‌ ముప్పరాజు వెంకట్రావు, తులసి సర్జికల్స్‌ అధినేత సంజీవ్‌ కుమార్‌, క్లబ్‌ గౌరవ సలహాదారు పొందూరి శివరాం ప్రసాద్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్‌ విజయ సాగర్‌ సంయుక్త కార్య దర్శులు డాక్టర్‌ బాజీ, డాక్టర్‌ నాగేంద్ర బాబు, సభ్యులు డాక్టర్‌ కిరణ్‌ డాక్టర్‌ ఉస్మాన్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement