అలల ధాటికి ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

అలల ధాటికి ఒకరు మృతి

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

చీరాల: తీరంలో విషాదం నెలకొంది. గుంటూరు నుంచి 30 మంది రామాపురం సముద్రతీరానికి శుక్రవారం వచ్చారు. కిషోర్‌, భరత్‌ ఇద్దరు అలల తాకిడికి కొట్టుకుపోగా గమనించిన అడ్వైంచర్‌ స్పోర్ట్స్‌ సిబ్బంది భరత్‌ను బయటకు తీసుకువచ్చారు. అలానే కిషోర్‌ను గాలించి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ప్రాణాపాయంతో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం చీరాల హాస్పిటల్‌కు తీసుకువెళ్లేలోపే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఈపూరుపాలెం ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement