ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: ప్రణాళికాబద్ధంగా నేరాలను నియంత్రించాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. శుక్రవారం బాపట్ల డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ప్రాంతాలవారీగా జరుగుతున్న నేరాల సరళిని, వాటిని పూర్తిగా కట్టడి చేయడానికి తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి ఆరాతీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని, రాత్రి సమయాల్లో గస్తీ మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వాడకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. పోలీసులు చలానాలు విధిస్తారనే భయంతో కాకుండా, స్వతహాగా వారే బాధ్యతతో హెల్మెట్ ధరించే విధంగా ప్రజల్లో మార్పు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ సీహెచ్.చంద్రమౌళి, బాపట్ల పట్టణ సీఐ రాంబాబు, రూరల్ సీఐ ప్రభాకర్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


