గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్‌

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్‌

నాలుగు కిలోల గంజాయి స్వాధీనం రిమాండ్‌ విధించిన కోర్టు

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణ పరిధిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను మంగళగిరి పట్టణ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి సుమారు 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, మంగళగిరి పట్టణానికి చెందిన వీరాంజనేయులు ఇద్దరూ స్నేహితులు. ఇరువురూ చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బీహార్‌ నుంచి వచ్చే వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా గంజాయి సేవించేవారికి అమ్మేవారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణ సీఐ వీరాస్వామి సిబ్బందితో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కవర్లను తనిఖీ చేయగా గంజాయి ఆకులు, పూలు, కాయలు ఉన్నట్లు గుర్తించారు. గంజాయిగా నిర్ధారించి లక్ష్మీనారాయణ, వీరాంజనేయులులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు ద్వారా శాంపిల్‌ను గంజాయి కెమికల్‌ పరీక్ష నిమిత్తం మంగళగిరి ఎఫ్‌ఎస్‌ఎల్‌ పంపుతారని కోర్టు వారు తెలియపర్చినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement