ఎగ్‌ కార్ట్‌ యూనిట్ల అభివృద్ధికి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎగ్‌ కార్ట్‌ యూనిట్ల అభివృద్ధికి శిక్షణ

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

మెప్మా జిల్లా పీడీ విజయలక్ష్మి

లక్ష్మీపురం: మెప్మా జీవనోపాధి ప్రోత్సాహక కార్యక్రమాల కింద, ఎన్‌ఈసీసీ (నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ) సహకారంతో పట్టణ ఎస్‌హెచ్‌జీ మహిళా లబ్ధిదారులకు ఎగ్‌ కార్ట్స్‌ ఉచితంగా అందజేస్తామని జిల్లా మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి.విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లా మెప్మా కార్యాలయంలో గురువారం ఎగ్‌ కార్ట్‌ యూనిట్ల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ఎగ్‌ కార్ట్‌ వ్యాపారం ప్రారంభించిన లబ్ధిదారుల వ్యాపార నైపుణ్యాలు, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్‌ వ్యూహాలు బలోపేతం చేయడం ఈ శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. మెప్మా కార్యాలయ సిబ్బంది, ఎన్‌ఈసీసీ కో–ఆర్డినేటర్‌ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement