అంతర్జాతీయ చెస్‌ టోర్నీని పరిశీలించిన శాప్‌ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ చెస్‌ టోర్నీని పరిశీలించిన శాప్‌ చైర్మన్‌

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

తాడికొండ: వీఐటీ ఏపీలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌ను గురువారం ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) గౌరవ చైర్మన్‌ అనిమిని రవి నాయుడు సందర్శించారు. అమరావతి అంతర్జాతీయ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌ నాలుగో రోజు సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌ను పరిశీలించిన ఆయన వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ పి అరుళ్మొళివర్మన్‌తో కలిసి చెస్‌ ఆడి క్రీడాకారులకు పలు సూచనలిచ్చారు. శాప్‌ డైరెక్టర్‌ ఎస్‌.సంతోష్‌ కుమార్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీశ్‌ చంద్ర ముదిగంటి, విద్యార్థి సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఖదీర్‌ పాషా, ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ కె.వి.వి.శర్మ, అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌, కార్యదర్శి జగదీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement