వెన్నుపోటు పాలనపై నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పాలనపై నిరసన గళం

Jun 5 2026 1:18 AM | Updated on Jun 5 2026 1:18 AM

వెన్నుపోటు పాలనపై నిరసన గళం ● రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రేపల్లె, నగరం, చెరుకుపల్లి మండలాల్లో జరిగిన ఆందోళనల్లో మోహన్‌కృష్ణ పాల్గొన్నారు. చెరుకుపల్లిలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. రేపల్లెలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులను తగులబెట్టారు. నిజాంపట్నం, రేపల్లె రూరల్‌ మండలాల్లో పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ● బాపట్ల నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలు జరిగాయి. బాపట్ల మండలంలోని వెదుళ్ళపల్లిలో జరిగిన ఆందోళనలో కోన రఘుపతి పాల్గొన్నారు. కర్లపాలెం మండల కేంద్రంతోపాటు పిట్టలవానిపాలెం మండలం చందోలులో పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నిరసన విజయవంతమైంది. ● వేమూరు నియోజకవర్గంలో సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. భట్టిప్రోలు మండలంలో నిరసన ర్యాలీతోపాటు రథం సెంటర్‌లో కూటమి మేనిఫెస్టో ప్రతులు దహనం చేసిన కార్యక్రమంలో అశోక్‌బాబు పాల్గొన్నారు. చుండూరు, అమృతలూరు, కొల్లూరు మండలాల్లో ఆయా మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కొల్లూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు మైనేని మురళి తదితరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పి పంపించి వేశారు. నియోజకవర్గంలో కార్యక్రమం విజయవంతమైంది. ● చీరాల నియోజకవర్గంలో సమన్వయకర్త కరణం వెంకటేశ్‌ ఆదేశాలతో చీరాల, వేటపాలెం మండలాల్లో మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. చీరాల కూరగాయల మార్కెట్‌ సెంటర్‌, వేటపాలెం గడియార స్తంభం సెంటర్లలో ఆందోళనలను నిర్వహించారు. నియోజకవర్గంలో కార్యక్రమం విజయవంతమైంది. ● పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్‌రెడ్డి ఆదేశాలతో... కారంచేడు, చిన్నగంజాం, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు మండలాల్లో మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. స్థానిక తహసీల్దారులకు వినతిపత్రాలు సమర్పించారు. నియోజకవర్గంలో కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు, మండల, జిల్లా రాష్ట్ర నేతలతోపాటు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులు కాల్చివేత వైఎస్సార్‌ సీపీ ఆందోళనకు అపూర్వ స్పందన

సాక్షిప్రతినిధి, బాపట్ల: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్‌ సీపీ వారం రోజులపాటు తలపెట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ఆ పార్టీ శ్రేణులనుంచే కాకుండా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇందులో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ‘ఈ కార్యక్రమాలు జరిగాయి. పలు మండలాల్లో పార్టీ నేతలు టీడీపీ ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. కొన్నిచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. అన్ని మండలాల్లోనూ నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వంచించిందని నేతలు ఆరోపించారు. తక్షణం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అధికారులకు ఎక్కడికక్కడ వినతిపత్రాలు సమర్పించారు. ఆందోళనలో పాల్గొన్న సమన్వయకర్తలు ప్రభుత్వం మోసపూరిత విధానాలను ప్రసంగాల ద్వారా ఎండగట్టారు. చంద్రబాబు వంచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పార్టీ బాపట్ల మండల అధ్యక్షుడు ఏడుకొండలురెడ్డి, ప్రచార కమిటీ నాయకుడు డేవిడ్‌, జిల్లా యూత్‌ అధ్యక్షుడు చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గాలవారీగా ఇలా...

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement