చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన బోయకొండ అమ్మవారిని కర్ణాటక రాష్ట్ర అదనపు డీఐజీ చంద్రశేఖర్ ఆదివారం దర్శించుకొన్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఈఓ ఏకాంబరం స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను చేయించిన అనంతరం అమ్మవారి విశిష్ట చరిత్రను అర్చకులు వివరించారు. అలాగే కర్ణాటకలోని ఎలక్ట్రానిక్ సిటీ ఎమ్మెల్సీ రామోజీ గౌడ అమ్మవారిని దర్శించుకొన్నారు. వీరికి ఆలయ అఽధికారులు సత్కరించి, జ్ఞాపికలతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
ఎంపిక
పీలేరురూరల్ : యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు పీలేరు కోటపల్లె జెడ్పీ బాలికల పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు ఎంపికై నట్లు ఎంఈవో పద్మావతి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన పదో తరగతి విద్యార్థిని ధృతి, క్విజ్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మాధవి, వ్యాసరచనలో మూడో స్థానం సాధించిన గురు విశ్రాంతి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు.
సౌత్ జోన్ అండర్–16
క్రికెట్ పోటీలకు..
మదనపల్లె సిటీ : సౌత్ జోన్ అండర్–16 బాలుర అంతర్ జిల్లా మల్టీ డే క్రికెట్ పోటీలకు మదనపల్లెకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు మదనపల్లె క్రికెట్ అకాడమీ ప్రధాన కోచ్ జనార్థన్ తెలిపారు. షారిక్ అక్తర్ (ఓపెనింగ్ బ్యాట్స్‌మన్), తేజేష్(లెఫ్ట్‌ఆర్మ్ లెగ్ స్నిన్నర్), ఎస్‌ఎండి మౌలా (రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్), వి.జె.నోయల్ (మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్) ఎంపికై నట్లు తెలిపారు. జూన్ 14 నుంచి జులై 2 వరకు వాల్మీకిపురంలోని జీవీఎస్‌సీఎస్ క్రికెట్‌మైదానంలో పోటీలు జరుగుతాయన్నారు.
‘మిట్స్’కు 4ఏ రేటింగ్
కురబలకోట : కేరీర్స్ ర్యాంకింగ్స్–26లో మదనపల్లి దగ్గర అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి 4ఏ రేటింగ్ దక్కినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల అనుసంధానం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నైపుణ్యం వంటి కీలక అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో జాతీయస్ఠాయిలో ఈ అరుదైన గుర్తింపు లభించడానికి కారణమైన సిబ్బందిని ఛాన్సలర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ద్వారకనాఽథ్, అభినందించారు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
సాక్షి, మదనపల్లె : స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదులను అధికారులు స్వీకరిస్తారని తెలిపారు. కిందిస్థాయిల్లో పరిష్కారంకాని ఫిర్యాదులను ప్రజలు కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.


