ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం

Jun 15 2026 1:17 AM | Updated on Jun 15 2026 1:17 AM

మదనపల్లె సిటీ: జిల్లాలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి పెట్టామని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈనెల 12వతేదీ నుంచి బడులు తెరుచుకున్న నేపథ్యంలో డీఈవో ‘సాక్షి’తో మాట్లాడారు.

● బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులందరూ కలిసి నిర్వహించాం. ఇందులో 1వ తరగతిలో 9,559 మంది విద్యార్థులను చేర్పించడం జరిగింది. రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచాం. అందరి సహకారంతో లక్ష్యం అధిగమించాం.

● జిల్లా కేంద్రానికి ఇప్పటికే వంద శాతం మేరకు పుస్తకాలు వచ్చాయి. టెక్ట్స్‌ పుస్తకాలు 5,59,378, వర్క్‌ బుక్కులు 1,26,136, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు 11,497, పిక్టోరియల్‌ డిక్షనరీలు 9,850 వచ్చాయి. బ్యాగులు,షూలు త్వరలో వస్తాయి. వాటిని అందజేస్తాం.

● పాఠశాలలో మైనర్‌ రిపేర్లు చేయించాలని ఆదేశించాం. 265 మోడల్‌ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.1042 ఆర్‌ఓ ప్లాంట్లు పనిచేయడం లేదు. వీటిని ఏజెన్సీ ద్వారా ఐదు సంవత్సరాలు గ్యారంటీతో రిపేరీ చేయిస్తాం.

‘సాక్షి’తో డీఈవో సుబ్రమణ్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement