గున్నమామిడీ కొమ్మ మీద.. పండ్లు ఒకటయ్యాయి! | - | Sakshi
Sakshi News home page

గున్నమామిడీ కొమ్మ మీద.. పండ్లు ఒకటయ్యాయి!

Jun 15 2026 1:17 AM | Updated on Jun 15 2026 1:17 AM

పల్లెటూరి తోటల్లో ఇలాంటి చిన్న చిన్న వింతలే పెద్ద సంచలనాలు. గుర్రంకొండలోని ఓ మామిడి తోటలో ఒకే తొడిమకు రెండు మామిడిపండ్లు జంటగా అతుక్కుపోయి కనిపించిన దృశ్యం ఇప్పుడు స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది. పసుపు పచ్చని దేహంతో, అచ్చం కవలలలా ఉన్న ఈ మామిడిపండు ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.బయటికి ఒకే పండుగా కనిపిస్తున్నా, లోపల మాత్రం రెండు విడివిడి ముట్టెలు దాచుకుని ‘రెండు మనసులు.. ఒకే ప్రాణం‘ అన్నట్టుంది ఈ జంట మామిడి. కూలీలు కాయలు కోస్తుండగా కంటపడిన ఈ వింతను చూడటానికి జనం తోట వైపు పరుగులు తీస్తున్నారు. వృక్షశాస్త్ర నిపుణులు దీనిని జన్యుపరమైన మార్పుల వల్ల జరిగే ’ఫాసియేషన్‌’ అని చెప్తున్నా.. ఆ పల్లెటూరి ప్రజలకు మాత్రం ఇది ఒక అందమైన ప్రకృతి బహుమతి!

18న జెడ్పీ సర్వసభ్య

సమావేశం

కడప వైఎస్సార్‌ సర్కిల్‌ : ఈ నెల 18వ తేదీన జిల్లా ప్రజా పరిషత్‌ (జెడ్పీ) సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీఈవో సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీలు), అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

– గుర్రంకొండ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement