వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రీడా మైదానంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ 16 బాలుర క్రికెట్ జట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. గ్రౌండ్ ఏలో కర్నూలు, నెల్లూరు మ్యాచ్‌ను సీడీసీఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లా జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ పోటీలు 20 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. అనంతరం గ్రౌండ్–బీలో అనంతపురం, కడప జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు ప్రసన్న కుమార్, షోయబ్, జవహర్ బాష, హరీష్ రెడ్డి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.


