ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,746 కోట్లు | 3746 crore Aarogyasri dues in Andhra Pradesh: Satya Kumar | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,746 కోట్లు

Apr 28 2026 4:45 AM | Updated on Apr 28 2026 4:46 AM

3746 crore Aarogyasri dues in Andhra Pradesh: Satya Kumar

మంత్రి సత్యకుమార్‌  

సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,746 కోట్ల బకాయి ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రై పార్టీ బిడ్‌ డిస్కౌంటింగ్‌ విధానంలో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.వెయ్యి కోట్ల బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులు ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సమకూరాయన్నారు. సుమారు 25 ఆస్పత్రులకు రూ.62 కోట్ల వరకు చెల్లింపులు చేసినట్టు వెల్లడించారు. ఆస్పత్రుల యాజమాన్యాలకు విడుదల చేసే నిధుల్లో నుంచి వడ్డీని ముందుగానే మినహాయించుకుంటున్నట్లు వివరించారు.  

అప్పునకు వడ్డీ ప్రభుత్వం చెల్లించకుండా... 
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.1,000 కోట్లు అప్పు చేసింది. అయితే, ఆ అప్పునకు వడ్డీ ప్రభుత్వం కట్టకుండా, ఆస్పత్రులకు చెల్లిస్తున్న మొత్తం నుంచి ముందుగానే కోత విధించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement