3 Years Of YS Jagan: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సంబరాలు

3 Years Of YS Jagan Government: YSRCP Celebrations Across The Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : నేటితో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో సోమవారం ప్రత్యేకంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాల నిర్వహణకు వైఎస్సార్‌సీపీ ఆదేశాలు జారీ చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  విజయసాయిరెడ్డి కేక్‌ కట్‌ చేశారు. ఈ వేడుకలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప.గో.జిల్లా

  • సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపముఖ్యమంత్రి తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు
  •   స్థానిక పోలీస్ ఐ ల్యాండ్ వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం కేక్ కట్ చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.

పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైన సందర్బంగా ఉదయగిరిలో సంబరాలు
  • దివంగత నేత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు
  • కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
  • నాయకులకు,కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ

అనంతపురం జిల్లా

  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్న జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం

వైఎస్సార్ జిల్లా

  • వైఎస్సార్ పార్టీ అధికారంలోకి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రొద్దుటూరు లో సంబరాలు
  • ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్డు లో వైఎస్సార్ విగ్రహం కు పులా మాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు..అనంతరం కేకు కట్ చేసి సంబరాలు చేసుకొన్న వైఎస్సార్ పార్టీ అభిమానులు, నాయకులు

నంద్యాల జిల్లా

  • వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బనగానపల్లె పట్టణం వైఎస్సార్‌ విగ్రహం కు పూల మాలలు వేసి సంబరాలు జరుపుకున్న అవుకు మండల పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి
  •  పాల్గొన్న సర్పంచ్ ఎల్లమ్మ,జెడ్పీటీసీ సుబ్బ లక్ష్మమ్మ,ఎంపీటీసీ లు,వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు,కార్యకర్తలు

తిరుపతి జిల్లా

  • తిరుపతి వైఎ‍స్సార్‌సీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం కొలువుతీరి నేటికి మూడేళ్లు పూర్తయిన శుభ సందర్భంగా నారాయణవనం మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళి అర్పించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జెడ్పీటీసీ సుమన్ కుమార్, ఎంపీపీ దివాకర్ రెడ్డి
  •   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైన సందర్బంగా గూడూరులో సంబరాలు 
  • దివంగత నేత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు
  • కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన పట్టణ కన్వీనర్ బొమ్మిడి శ్రీనివాసులు

శ్రీ సత్యసాయి జిల్లా 

  • వైఎస్ జగన్ మూడేళ్ళ పాలన పూర్తి అయిన సందర్బంగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి

గాజువాకలో 

  • వైఎస్ జగన్ మూడేళ్ళ పాలన పూర్తి అయిన సందర్బంగా గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు... పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ కార్యకర్తలు

నెల్లూరు జిల్లా

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైన సందర్బంగా ఆత్మకూరులో సంబరాలు 
  • వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో దివంగత వైఎస్సార్‌చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు కేక్ కట్ చేసిన వైఎస్సార్‌సీపీ ఇంచార్జి మేకపాటి విక్రమ్‌ రెడ్డి
  • నాయకులకు,కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ

 తిరుపతి జిల్లా 

  • వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమత్రిగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా సూళ్లూరుపేట  చెంగాళ్ళమ్మను  దర్శించుకున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి 

కృష్ణా జిల్లా

  • ఉయ్యూరు లో  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
  • ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అవనిగడ్డ వంతెన సెంటర్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top