ప్రమాద తీవ్రతకు శిథిల సాక్ష్యాలుగా.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాద తీవ్రతకు శిథిల సాక్ష్యాలుగా..

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌–2 విభాగంలో సంభవించిన ఘోర ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్న అంతర్గత దృశ్యమిది. లాడిల్‌ పేలి అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ద్రవరూప ఉక్కు ఒక్కసారిగా ఉప్పొంగి పడటంతో ప్లాంట్‌ లోపలి క్యాబిన్ల అద్దాలు, ఇనుప రేకులు పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాయి. పేలుడు ధాటికి భారీ కేబుళ్లు సైతం కాలిపోయి వేలాడుతుండగా, పరిసరాల్లోని యంత్రాలు, ఫ్యాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న యాజమాన్య ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, హెల్మెట్లు ధరించిన రక్షణ సిబ్బంది ధ్వంసమైన యంత్రాలను, కాలిపోయిన భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్లాంట్‌ అంతటా దట్టమైన బూడిద, కాలిపోయిన అవశేషాలు పేరుకుపోయి భీతావహ వాతావరణాన్ని తలపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement