మహారాణిపేట(విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల పరిహారం అందించాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర డిమాండ్ చేశారు. విశాఖలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు తీరని లోటు అన్నారు. మృతుల కుటుంబాల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.


