చంద్రబాబు పాలన అవినీతిమయం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలన అవినీతిమయం

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ

అచ్యుతాపురం రూరల్‌: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లలో సాగించిన పాలన అవినీతిమంగా మారిందని వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ అచ్యుతాపురం మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు ఆధ్వర్యంలో మంగళవారం అచ్యుతాపురం లేపాక్షి కల్యాణ మండపంలో నాలుగు మండలాల ముఖ్యనాయకులు కార్యకర్తలతో ‘రెండేళ్ల కూటమి పాలన కుతంత్రాల చర్చా వేదిక’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని చెప్పారు. సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.450 కోట్ల వ్యయంతో పూడిమడకలో జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుడితే చంద్రబాబు ప్రభుత్వం దానిని నిలుపుదల చేయడం అన్యాయమన్నారు. బ్లూ జెట్‌ ఫార్మా వంటి రసాయన పరిశ్రమల కారణంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పరిశ్రమల్లో మత్స్యకారులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలేదని చెప్పారు.

అరాచకాలకు అంతే లేదు..

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, నియోజకవర్గ పరిశీలకుడు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అరాచకాలకు అంతేలేకుండా పోయిందన్నారు. ఎక్కడా లేని విధంగా మునగపాక మండలంలో గ్రావెల్‌ దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో రైతులు ఎరువుల సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులను పిలుపునిచ్చారు. మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారిందన్నారు. అచ్యుతాపురంలో ఫ్లై–ఓవర్‌ నిర్మాణం కారణంగా ఎంతో మందికి అన్యాయం జరిగిం దని, వ్యాపారాలు కోల్పోయే దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రమంతటా రాక్షస పాలన, దగాకోరు పాలన కొనసాగుతోందని చెప్పారు. ఈ నెల 12వతేదీ ఉదయం 8.30 గంటలకు ధర్మశ్రీ స్వగ్రామమైన రాంబిల్లి మండలం మామిడివాడ నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్‌ బోదెపు గోవింద్‌, జిల్లా అధికార ప్రతినిధి భీముని వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రాంబిల్లి మండల అధ్యక్షుడు కిషోర్‌ రాజు, మునగపాక మండల అధ్యక్షుడు ఆడారి అచ్చియ్యనాయుడు, జెడ్పీటీసీ సోము సత్యనారాయణ, అచ్యుతాపురం వైస్‌ ఎంపీపీ వాసుపల్లి పద్మ శ్రీనివాస్‌, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు సియ్యాద్రి బుజ్జి, రాష్ట్ర బీసీ సెల్‌ జాయింట్‌ సెక్రటరీ చోడపల్లి దేముడు, వైఎస్సార్‌టీయూసీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు చోడిపల్లి అప్పారావు, సీనియర్‌ నాయకులు కూండ్రపు విమలా నాయుడు, గంగిరెడ్డి రాము, లాలం వాణివాసు, గొర్లి ప్రసన్న కుమార్‌, గొర్లి నూకరాజు, కారుకుండి శ్రీను, పంచదార్ల పైడిరాజు, రాజాన నాయుడుబాబు, యాండ్ర పైడిరాజు, శెట్టి నాగేశ్వరరావు, లాలం శ్రీను, మాడెం సూరి అప్పారావు, పిన్నమరాజు రవీంద్రరాజు, శనివాడ జువ్వలనాయు డు, దొడ్డి కృష్ణ, పీలా నర్సింగరావు, తోట వెంకటేష్‌, పంచదార్ల రవి, తట్టా రాజు, బండారు రమణ, పుర్రె సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement