స్కేటింగ్‌ క్రీడాకారిణికి అభినందన | - | Sakshi
Sakshi News home page

స్కేటింగ్‌ క్రీడాకారిణికి అభినందన

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

నర్సీపట్నం: ఇటీవల తైవాన్‌లో జరిగిన అంతర్జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో నర్సీపట్నానికి చెందిన పి.చైత్రదీపిక అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు కైవసం చేసుకుంది. క్రీడాకారిణి మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో స్పీకర్‌ సీహెచ్‌.అయ్యన్నపాత్రు డుని మర్యాదపూర్వకంగా కలిసింది. ఆమెను స్పీక ర్‌ అభినందించారు. తైవాన్‌ ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఓపెన్‌ కాంపిటిషన్స్‌లో చైత్రదీపిక భారతదేశం తరపున ప్రాతి నిధ్యం వహించింది. యూత్‌ కేటగిరి ఇన్‌లైఫ్‌ ఈవెంట్‌లో రజత పతకం, సోలో డ్యాన్స్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం, క్యాడెట్‌ కేటగిరి షో గ్రూప్‌ ఈవెంట్‌లో రజత పతకాలు సాధించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement