రోలుగుంట: వీఆర్పీ అక్రమాలపై చేపట్టిన విచారణకు అధికారులు గైర్హాజరవడంతో ఫిర్యాదు దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కొమరవోలులో వీఆర్పీ కృష్ణ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉపాధి హామీ కూలీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 4, 6 తేదీల్లో అధికారులు విచారణ జరిపారు. మళ్లీ మంగళవారం నిర్వహించిన విచారణకు ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావు, ఏపీడీ చిన్నారావు హాజరు కాలేదు. ఏపీవో మాత్రమే హాజరుకావడంతో ఫిర్యాదుదారులు బి.వి.జె,పాత్రుడు, బండారు వరహాలుదొర, వంటాకుల సత్తిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచరాణాధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తురున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాఽఽఽధికారులు వస్తేనే తాము సహకరిస్తామని వారు ఏపీవోతో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఏపీవో, ఫిర్యాదుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. విచారణ నిర్వహించకుండానే ఏపీవో వెనుదిరిగారు. దీనిపై ఎంపీడీవో నాగేశ్వరరావుని సాక్షి సంప్రదించగా తాను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటన డ్యూటీలో పాల్గొనాల్సి వచ్చిందని, ఏపీడీ చిన్నారావు తమశాఖ పీడీ నిర్మాలాదేవి ఆదేశాల మేరకు గొలుగొండ మండలంలో విధులు నిర్వాహించాల్సి వచ్చిందని వివరించారు.


