వైభవంగా పరదేశిమాంబ జాతరలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పరదేశిమాంబ జాతరలు

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

దేవరాపల్లి: మండలంలోని ముషిడిపల్లి, గరిశింగిలో పరదేశి మాంబ అమ్మవారి పెద్ద పండగలను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముషిడిపల్లిలో సుమారు 30 ఏళ్ల తర్వాత, గరిశింగిలో 18 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో నిర్వహించడంతో అధిక సంఖ్యలో బంధు మిత్రులు, భక్తులు హాజరయ్యారు. దీంతో గ్రామాలు సందడిగా మారాయి. తెల్లవార జాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసాయి. అమ్మవారి ప్రతిరూపంగా చెక్కతో తీర్చిదిద్దిన బండి ప్రభ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నిర్వహించిన దేవతామూర్తుల వేషధారణలు, బిందెల డ్యాన్స్‌, మహిళల కోలాట ప్రదర్శనలు, రాత్రికి నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

మాజీ డిప్యూటీ సీఎం బూడి పూజలు

గరిశింగి, ముషిడిపల్లిలో పరదేశి అమ్మవారిని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు దర్శించుకుని పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి వెంట జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, డాక్టర్‌ వరదపురెడ్డి సింహాచలం నాయుడు, వైఎస్సార్‌సీపీ మాడుగుల బీసీ సెల్‌ అధ్యక్షుడు ఆదిరెడ్డి త్రినాఽథస్వామి, సీనియర్‌ నాయకులు చింతల సత్య వెంకటరమణ, వరదపురెడ్డి లలితానాయుడు, గూడెపు రాము, గూడెపు మోహన్‌, గూడెపు అప్పారావు, ముషిడిపల్లిలో లెక్కల తాతబాబు, బొడ్డు నారాయణమూర్తి, బొడ్డు పెద అప్పారావు తదితరులున్నారు.

దేవరాపల్లిలో...

మండల కేంద్రం దేవరాపల్లి రెల్లి వీధిలో పోలమాంబ అమ్మవారి పండగ మంగళవారం ఘనంగా జరిగింది. స్థానికులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు వరదపురెడ్డి చంద్రరావు, గంగవంశం సంతోష్‌, వరదపురెడ్డి అప్పలనాయుడు, కొరుప్రోలు శ్రీను, పాచిల వెంకటరావు తదితర్లు పాల్గొన్నారు. శంభువానిపాలెంలో పరదేశమ్మ అమ్మవారి ఒడ్డు పండగ మంగళవారం ఘనంగా జరిగింది. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, రాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ముషిడిపల్లిలో 30 ఏళ్లు, గరిశింగిలో 18 ఏళ్ల తర్వాత భారీ ఎత్తున నిర్వహణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement