ఆదివాసీల ఫిర్యాదుపై తహసీల్దార్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల ఫిర్యాదుపై తహసీల్దార్‌ విచారణ

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

రావికమతం: ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హైదరాబాద్‌కు చెందిన చుండూరు ఉషారాణి,భర్త నాగేశ్వరరావు బెదిరిస్తున్నారని, అధికారుల ద్వారా స్వాధీనం చేసుకోడానికి యత్నిస్తున్నారని, ఈ విషయంపై కలెక్టర్‌ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని చీమలపాడు పంచాయతీ జెడ్‌.జోగుంపేట గ్రామానికి చెందిన ఆదివాసీలు చేసిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌ అంబేడ్కర్‌ మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ సర్వే నంబరు 66–2లో 78 ఎకరాల జిరాయితీ భూమిలో పది ఎకారాలను తాను కొనుగోలు చేశానని చెప్పారు. అనంతరం తహసీల్దార్‌కు డాక్యుమెంట్లు చూపించారు. మీ దగ్గర ఏమైనా డ్యాకుమెంట్లు ఉంటే చూపించాలని ఆదివాసీలను తహసీల్దార్‌ అడగగా తాము చాలా సంవత్సరాల నుంచి సాగులో ఉన్నామని ఈ భూమి తమకే చెందుతుందని ఆదివాసీలు తెలిపారు. దీనిపై నివేదికను జిల్లా అధికారుల అందజేస్తానని తహసీల్దార్‌ చెప్పారు.ఎటువంటి గొడవలు జరగకుండా కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement