రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

బుచ్చెయ్యపేట: మండలంలో గల పీపీ ఆగ్రహారం శివారు గొర్లెపాలెం గ్రామానికి చెందిన యువకుడు వెలుగుల ప్రసాద్‌(24) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం గ్రామం నుంచి వెళ్లి పోయి అనకాపల్లి ఏఎంఏఎల్‌ కాలేజీ వద్ద ట్రైన్‌ క్రింద పడి మృతి చెందాడు. ఇతని మృతికి గల కారణాలు తెలియడం లేదు. గ్రామానికి చెందిన వెలుగుల సత్తిబాబు, మాణిక్యంలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవశాయం చేసుకుని జీవిస్తున్న సత్తిబాబు తన కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు ప్రసాద్‌కు వివాహం చేయడానికి చూస్తున్నారు. ఇంటర్‌ చదివిన ప్రసాద్‌ ప్రస్తుతం లంకెలపాలెం వద్ద ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. తమ కుమారుడు ఆత్మహత్యకు కారణమేమిటో తల్లిదండ్రులకు అంతుచిక్కడం లేదు. అందివచ్చిన కుమారుడు అకాల మృతితో ప్రసాద్‌ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ప్రసాద్‌ మృతదేహానికి బుధవారం శవ పంచనామా నిర్వహిస్తారని గ్రామస్తులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement