కశింకోట: ఒడిశా నుంచి రాజస్థాన్‌కు మోటారు బైక్‌పై గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని కశింకోట వద్ద సోమ వారం అరెస్టు చేసినట్టు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. స్థానిక పీఏసీఎస్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడినట్టు తెలిపారు. రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లా రతన్‌పురా గ్రామానికి చెందిన డ్రైవర్ ఈశ్వర్ గుజ్జర్ (27), అదే జిల్లాకు చెందిన కూలీ మహమ్మద్ సల్మాన్ (30)లను అరెస్టు చేశామన్నారు. రాజస్థాన్ నుంచి అనకాపల్లి వచ్చి పూడిమడక మార్గంలోని వంతెన వద్ద బైక్‌ను దొంగిలించి ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా ఎస్‌ఐలు లక్ష్మణరావు, సతీష్, ఏఎస్‌ఐ మణికుమారి, సిబ్బంది పట్టుకున్నార న్నారు. దొంగిలించిన బైక్‌తో పాటు గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా పోలీసులను అభినందించారు.


