వెన్నుపోటు చంద్రబాబుకు కొత్తకాదు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు చంద్రబాబుకు కొత్తకాదు

Jun 9 2026 4:54 AM | Updated on Jun 9 2026 4:54 AM

నర్సీపట్నం: వెన్నుపొటు పొడవడం సీఎం చంద్రబాబుకు కొత్తకాదని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం, ఓటర్ల జాబితాపై బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమం, పార్టీ విస్త ృతస్థాయి సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ కోఆర్డినేటర్‌ హర్షవర్ధన్‌రెడ్డి బీఎల్‌ఏలు విధులు, బాధ్యతులు గురించి అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి అమర్నాథ్‌ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నుండి పుట్టింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. వైశ్రాయి హోటల్‌ నుండి పుట్టింది టీడీపీ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం బలంగా ఉండడం వల్లనే స్పీకర్‌ తనయుడు సిహెచ్‌.విజయ్‌కు రాజ్యసభ సీటు వచ్చిందన్నారు. కోర్టు తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న పనులను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే గణేష్‌, ఆయన అనుచరులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ అక్రమ కేసులకు భవిష్యత్తులో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఓట్లు కోల్పోవడం వల్ల పక్క రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిబెంగాల్‌లో అధికారం కోల్పోవడంతో పాటు సీఎం అభ్యర్థులు ఓడిపోయారన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మన పార్టీ సానుభూతిపరుల ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందన్నారు.ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే జిల్లా గెలిచే మొదటి సీటు నర్సీపట్నమే అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలైతే..ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తుందన్నారు. మెడికల్‌ కాలేజీను ప్రవేటుపరం చేద్దామని కూటమి ప్రభుత్వం పూనుకుంటే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరికతో ఎవరు ముందుకు రాలేదన్నారు. మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ లైటరైట్‌ గిప్టుగా స్పీకర్‌ తనయుడు విజయ్‌కు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవగా ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ తప్పుడు కేసులు పెట్టి గణేష్‌ను స్పీకర్‌ కుటుంబం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. పార్లమెంట్‌ పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీ డాక్టర్‌ బి.సత్యవతి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

స్పీకర్‌ మూల్యం చెల్లించక తప్పదు: గణేష్‌

అక్రమ కేసులు పెట్టి తనను, తన అనుచరులను ఇబ్బంది పెట్టిన స్పీకర్‌ సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోకపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి వైదొలుగుతానని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్పీకర్‌ నియోజకవర్గ ప్రజలకు రూ.760 కోట్లు బాకీ ఉన్నారని, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. డబ్బు, అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2029లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మీకంటే ఆలోచన శక్తిని భగవంతుడు నాకు ఇస్తాడు. మీరుచేస్తున్న అరాచకాలకు వంతపాడుతున్న మీ పార్టీ నాయకులు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, నియోజకవర్గ బూత్‌ కన్వీనర్ల అధ్యక్షుడు సుర్ల చంద్రశేఖర్‌, పట్టణ అధ్యక్షులు ఏకా శివ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు వాసు, వెంకటరత్నం, నాగేశ్వరరావు, పాణిశాంతరామ్‌, ఎంపీపీలు మణికుమారి, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు పాల్గొన్నారు.

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement