జిల్లాలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు నిల్‌ ● నిరుపయోగంగా పైపులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు నిల్‌ ● నిరుపయోగంగా పైపులు

Jun 8 2026 7:18 AM | Updated on Jun 8 2026 7:18 AM

జిల్లాలో మోగుతున్న ప్రమాద ఘంటికలు

తాగునీటి బావుల్లో, చెరువుల్లో అడుగంటిన నీటి వనరులు

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు..

జిల్లాలో రూ..885.23 కోట్లతో 2,691 పనులకు గాను 986 పనులు పూర్తి

గత ప్రభుత్వంలో ఆమోదం పొందిన 885 పనుల రద్దు..143 పనులు పెండింగ్‌

జిల్లాలో 16,059 చేతిపంపులు, 2.64 లక్షల కుళాయి కనెక్షన్లు

సాక్షి, అనకాపల్లి: వేసవి ఆరంభం నుంచే ప్రారంభమైన నీటిఎద్దడి సమస్యలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నా యి. ఎండల తీవ్రతకు నదులు, చెరువులు, బావు లు, బోర్లు పూర్తిగా అడుగంటాయి. గ్రామాల్లో నిలిచిపోయిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులు పూర్తి చేయడానికి నిధుల్లేవంటూ అధికారులు చెబుతు న్నారు. మరో వైపు కేంద్ర జలవనరుల శాఖ ఈ మిషన్‌ను 2028 వరకూ పొడిగించినట్టు ప్రకటించింది. ముఖ్యంగా నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండలాల పరిధిలోని శివారు గిరిజన గ్రామాల్లో దాహార్తి కేకలు మిన్నంటుతున్నాయి. గుక్కెడు నీటి కోసం గిరిజన మహిళలు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర మండుటెండలో నడవాల్సి వస్తోంది. జల్‌ జీవన్‌ మిషన్‌ గడువును కేంద్రం 2028 వరకు పొడిగించినా, నిధులు లేవంటూ ఇక్కడ కుళాయిల ఏర్పాటును అధికారులు గాలికొదిలేశారు. గత్యంతరం లేక బురద నీటినే వడపోసుకుని తాగుతున్నామని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

నాతవరం మండలం పెద జగ్గంపేటలో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. వేసవి కాలం ముదురుతున్నా అధికారులు కనీసం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో గ్రామస్తులు నీటి కోసం అల్లాడిపోతున్నారు. చేతిబోర్లు సైతం మరమ్మతులకు గురయ్యాయి. ఈ విషయమై గ్రామస్తులు పలుమార్లు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. యుద్ధప్రాతిపదికన స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, గ్రామంలోని చేతి బోర్లకు మరమ్మతులు చేయించాలని వేడుకుంటున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరైన పనులే రద్దు

జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు పనులకు కూటమి ప్రభుత్వంలో గ్రహణం పట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దుచేసి, తిరిగి టీడీపీ నేతలు, అధికార పార్టీల ఎమ్మెల్యే లు సిఫారసు చేసిన వాటికే మళ్లీ కొత్త అనుమతులిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 4 ,18,167 ఇళ్లుండగా..2024 మార్చి నెలాఖరి నాటికి 2,63,352 ఇళ్లకు వైఎస్సార్‌సీపీ హయాంలో కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 188 ఇళ్లకునెక్షన్లు ఇచ్చారు. వాటికి తోడు ఇంకా ఇవ్వాల్సిన 1,54,627 కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు సరికదా మంజూరైన వాటినే రద్దు చేశారు. అదేవిధంగా 16,057 చేతి పంపులను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో రూ.885.23 కోట్ల అంచనా విలువతో 2,691 పనులను మంజూరు చేశారు. వీటిలో 243.48 కోట్లతో 1023 పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. గత ప్రభుత్వంలో ఆమోదం పొందిన 885 పనులను రద్దు,143 పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement