అమ్మవారికి బంగారం ముక్కు పుడక | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి బంగారం ముక్కు పుడక

Jun 8 2026 7:18 AM | Updated on Jun 8 2026 7:18 AM

దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి ప్రజల ఆరాధ్య దైవం సన్యాసమ్మ అమ్మవారికి గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయ దంపతులు కాలిపు అప్పారావు, మణి పావు తులం బంగారంతో తయారీ చేయించిన ముక్కు పుడకను బహుకరించారు. దానిని ఆలయ ధర్మకర్త వరదపురెడ్డి సన్యాసిరావు (లలితానాయుడు)కు అందజేశారు. అప్పారావు,మణి దంపతులను ఆలయ ధర్మకర్త అభినందించి, అమ్మవారి తీర్థ, ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వరదపురెడ్డి సింహాచలం నాయుడు, వేచలపు అప్పలనాయుడు, కె.వి.రమణ, గుండు రాంబాబు, వరదపురెడ్డి చంద్రరావు, గొర్లి తాతారావు, చొక్కాకుల రమణ, గంగవంశం సంతోష్‌, కొరుప్రోలు శ్రీను తదితర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement