మాజీ హై కమిషనర్ బైసాబ్ చరణ్ ప్రధాన్
ఐఐఎంవీలో ముగిసిన గ్రీన్ ఎకానమి అంతర్జాతీయ సదస్సు
ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తాం
ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ ఇమ్మిడి పృధ్వీరాజ్
తగరపువలస: హరిత వృద్ధితో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందని మాజీ హై కమిషనర్ బైసాబ్ చరణ్ ప్రధాన్ పేర్కొన్నారు. గంభీరంలోని ఐఐఎంవీ ప్రాంగణంలో ‘ఇంటర్ డిసిప్లీనరీ డెసిషన్ సైన్సెస్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘గ్రీన్ ఎకానమీ’ అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన చరణ్ ప్రధాన్ మాట్లాడుతూ అంతర్జాతీయ కూటముల ద్వారా ప్రపంచ వాతావరణ పరిపాలనలో భారత్ నాయకత్వ స్థానానికి చేరుకుంటోందని స్పష్టం చేశారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ పృథ్వితేజ్ ఇమ్మడి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్ రవి సమన్వయకర్తగా వ్యవహరించగా కోపెన్‌హాగన్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అబిద్ హుస్సేన్, సదరు ల్యాబ్ విభాగాధిపతి శివశంకర్ పటేల్, జమ్ము కాశ్మీర్ లక్ష్మీపత్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సి.విజయశేఖర్, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మోనికా సింఘానియా, జీ2వో సోలార్ సీటీఓ వివేక్ వర్థన్, డీన్ కావేరీ కృష్ణన్, మారిశెట్టి విజయభాస్కర్, పీఆర్ శర్మ, అమిత్ శంకర్, నెక్కంటి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


