ఆబోతు రమణకు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

ఆబోతు రమణకు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

దేవరాపల్లి: హెల్ప్‌ పుల్‌ హ్యాండ్స్‌ సామాజిక వారధి స్వచ్ఛందసేవా సంస్థ వ్యవస్థాపకుడు, రైవాడ గ్రామానికి చెందిన ఆబోతు రమణ విజయవాడలో ఆదివారం ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా నిర్వహించిన ‘దండి మార్చ్‌ 2.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోఆర్డినేటర్స్‌కు అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని విజయవాడలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఆబోతు రమణకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు. సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమణను పలువురు ప్రశంసించారు. రమణ అవార్డులను అందుకోవడం పట్ల హెల్ప్‌ పుల్‌ హ్యాండ్స్‌ సామాజిక వారధి స్వచ్చంధ సేవా సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement