మ్యాపును పరిశీలిస్తున్న రష్యా దేశస్తులు
మాకవరపాలెం: మండలంలోని యరకన్నపాలెంలో డోజ్కో కంపెనీ ప్రతినిధులైన రష్యా దేశస్తులు పర్యటించారు. రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 737 సర్వే నంబర్‌లో ఇటీవల ప్రభుత్వం 406 ఎకరాల భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో 150 ఎకరాలను భారీ వాహనాల విడి భాగాల తయారు చేసే డోజ్కో కంపెనీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో శనివారం కంపెనీకి చెందిన రష్యా ప్రతినిధులు యరకన్నపాలెం ప్రాంతంలో పర్యటించి భూములను, మ్యాపును పరిశీలించారు. రవాణాకు సంబంధించి రోడ్డు మార్గం, తదితర వివరాలను తెలుసుకుని వెళ్లారు.


