ఈదురు గాలులు, భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులు, భారీ వర్షం

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

నాతవరం: మండలంలో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు మధ్యాహ్నం వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు. అంతలోనే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాతవరం మెయిన్‌ రోడ్డుపై వర్షం నీరు ప్రవహించడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. పీహెచ్‌సీ ప్రాంతంలో తాండవ కాలువపై నిర్మించిన వంతెనపై నీరు నిలిచిపోవడంతో వాహచోదకులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. రబీలో వేసిన నువ్వు పంటకు, ఖరీఫ్‌లో వేయబోయే పంటలకు ఈవర్షం ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు.

నాతవరం తాండవ వంతెనపై ప్రవహిస్తున్న నీరు

నాతవరంలో రోడ్లు జలమయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement