నిందితుల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

నిందితుల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

సీసీఫుటేజీలను చూపించి ఆరాతీస్తున్న సీఐ మురళి

నక్కపల్లి: గత మంగళవారం అర్ధరాత్రి ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ కి పాల్పడిన నిందితుల ఆచూ కీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నక్కపల్లి సీఐ జె.మురళి కోరారు. కొన్ని సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల ఫొటోలు, వారు చోరీచేస్తున్న విజువల్స్‌ను విడుదల చేశారు. నిందితుల ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. వీటిని అందరూ వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌చేయాలని, నిందితులు ఆచూకీ తెలిసినా, వారేనని అనుమానం వచ్చిన వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.శనివారం మరోసారి ఆలయప్రాంగణాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల్లో పలువురికి సీసీ ఫుటేజీలను చూపించి నిందితులను గుర్తుపట్టగలరా అని ఆరా తీశారు. అన్నిగ్రామాల్లోను ఈ వీడియోపుటేజీలను చూపించి నిందితులను గుర్తుపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement