ఎరువుల సరఫరాలో అక్రమాలకు పాల్పడితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎరువుల సరఫరాలో అక్రమాలకు పాల్పడితే చర్యలు

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

సమావేశంలో మాట్లాడుతున్న

జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి

యలమంచిలి రూరల్‌: ఎరువుల సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి హెచ్చరించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో ఎరువుల డీలర్లు,రైతుసేవా కేంద్రాల సిబ్బంది,వ్యవసాయాధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇకపై ఎరువుల సరఫరాను ఏపీఏఐఎంఎస్‌ ద్వారానే చేపట్టాలన్నారు.ఈ–పోర్టల్‌లో రైతు ఆధార్‌ నంబర్‌,గత ఖరీ్‌ఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పంటల విస్తీర్ణం ఆధారంగా ఎరువులను సరఫరా చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కచ్చితమైన నియమ నిబంధనలు రూపొందించిందని వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. రబీ సీజన్‌లో సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసిన రామారాయుడుపాలెంకు చెందిన అభ్యుదయ రైతులు బెజవాడ చిరంజీవి,గొర్లి బాబూరావు,మళ్ల బాబూరావులకు గుడ్‌ అగ్రిక ల్చరల్‌ ప్రాక్టీసెస్‌ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి,పాయకరావుపేట ఏడీఏలు సుమంత,ప్రసాద్‌,మండల వ్యవసాయాధికారులు పొలిమేర మోహన్‌రావు,శంకర్‌,గోవింద్‌,పలువురు ఎరువుల డీలర్లు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement