యలమంచిలి యువకుడికి ‘గిన్నిస్‌ బుక్‌’లో స్థానం | - | Sakshi
Sakshi News home page

యలమంచిలి యువకుడికి ‘గిన్నిస్‌ బుక్‌’లో స్థానం

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌

అందుకుంటున్న జగదీష్‌ పాల్‌

యలమంచిలి రూరల్‌:యలమంచిలి కాకివాని వీధికి చెందిన కె.జగదీష్‌ పాల్‌ ఎలక్ట్రానిక్‌ కీ బోర్డు వాయించడంలో ప్రతిభ చూపడంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. గత ఫిబ్ర వరిలో హైదరాబాద్‌లో జరిగిన నాన్‌ స్టాప్‌ కీ బోర్డ్‌ ప్లే పోటీల్లో జగదీష్‌ పాల్‌ ప్రతిభ చూపి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. ఈ పోటీల్లో 22 దేశాలకు చెందిన సుమారు 2,000 మంది పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా దక్షిణ భారతదేశ శాసీ్త్రయ సంగీత సరళి స్వరాలతో పాటు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఎలక్ట్రానిక్‌ కీ బోర్డును గంట సేపు వాయించాడు.ఈ మేరకు జగదీష్‌ పాల్‌కు శనివారం పెందుర్తి ఐపీసీ చర్చిలో ధ్రువీకరణ పత్రం, మెడల్‌ అందజేసి అభినందించారు. జగదీష్‌ పాల్‌ తండ్రి పీటర్‌ పట్టణంలో కాకివాని వీధిలో జేసీపీఎఫ్‌ చర్చి నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement