భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

‘చంద్రబాబు మోసాలకు రెండేళ్లు’

కార్యక్రమానికి విశేష స్పందన

మునగపాకలో భారీ ర్యాలీ, మెయిన్‌రోడ్డుపై బైఠాయింపు

కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

చోడవరం: పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అన్ని అర్జీలను నెలరోజుల్లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ అన్నారు. చోడవరం నియోజవర్గానికి సంబంధించిన చోడవరంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ లో భూ, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం పలు వురు అర్జీలు అందజేశారు. కలెక్టర్‌ స్వయంగా వినతులు స్వీకరించారు. గత వారం వందలాది దరఖాస్తులు రావడంతో వాటి పరిష్కారం ఏమేరకు జరిగాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్‌ ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించా లని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులంతా సమష్టిగా పనిచేసి రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందు కు కృషిచేయాలన్నారు. భూ పరిపాలన కమిషనర్‌ (సీసీఎల్‌ఎ) నిబంధనలకు లోబడి భూ సమస్యలు పరిష్కరించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శార్యమన్‌ పటేల్‌, డీఆర్‌వో సత్యనారాయణ, ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్‌ ఆయీషా, వి.వి.రమణ, చోడవరం తహసీల్దార్‌ రామారావు, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల తహసీల్దారులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు

గుణపాఠం తప్పదు

న్యాయపోరాటం చేస్తాం

ఉపమాక వెంకన్న ఆలయంపై టీటీడీ చిన్నచూపు చూస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేవిధంగా వ్యవహరిస్తోంది. తమ ఇష్టదైవానికి సెంటిమెంట్‌తో భక్తులు సమర్పించిన కానుకలకు రక్షణ కల్పించడంలో విఫలమవు తోంది. సరైన రక్షణ కల్పించకుండా ఆలయా న్ని నిర్లక్ష్యంగా వదిలేస్తోంది. టీటీడీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన సరిగ్గా ఉండడంలేదు.అధికారులు సిబ్బంది ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీటీడీ వైఖరిపై న్యాయపోరాటం చేస్తాం.

– దేవవరపు వెంకటరమణ భక్తుడు, నక్కపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement