● ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు
● 7 బైక్‌లు స్వాధీనం
అనకాపల్లి: మండలంలోని బీఆర్టీ కాలనీ ప్రాంత పరిధిలో టిడ్కో గృహాల్లో 71 మంది పోలీసు సిబ్బందితో శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అనకాపల్లి టౌన్, ట్రాఫిక్, రూరల్ సర్కిల్, కశింకోట పోలీస్ స్టేషన్లకు చెందిన 12 మంది అధికారులు, 71 మంది సిబ్బందితో ప్రతి గృహాన్ని తనిఖీ చేశారు.సరైన పత్రాలు లేని ఏడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎం.శ్రావణి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబ వ్యవస్థలను నాశం చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం స్థానికులతో ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ చేయించారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మాణాకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు జి.ప్రేమ్‌కుమార్, అశోక్‌కుమార్, అల్లు స్వామినాయుడు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


