అనకాపల్లి: జిల్లాలో పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంట్నుట్టు అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ సంపర్క్(ఫోన్ ఇన్ పోలీస్ సిబ్బంది) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న 11 మంది హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెచ్‌సీలు వారి వ్యక్తిగత, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలను ఫోన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారి సమస్యలను ప్రతీ శుక్రవారం సెల్ నంబర్. 93469 12011 ద్వారా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో సీహెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


