పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

చోడవరం కోర్టుల ఆవరణంలో మొక్కలు నాటుతున్న 9వ అదనపు జిల్లా జడ్జి

హరినారాయణ, అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ సూర్యకళ

చోడవరం: పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని 9వ అదనపు జిల్లా జడ్జి హరినారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరం కోర్టుల ఆవరణంలో జన విజ్ఞాన వేదిక, బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ సూర్యకళ, ఏపీపీ చీపురుపల్లి సూర్యనారాయణ, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

చీడికాడ: ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కనైనా నాటి, పరిక్షించాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని జి.కొత్తపల్లి కేజీబీవీలో శుక్రవారం ఆమె మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కేజీబీవీ ఆవరణలో 50 సెంట్ల స్థలంలో సుమారు 3,200 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్టు జిరామ్‌జీ పథకం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కిషోర్‌ లింకన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement