వేటు పడిన సిబ్బంది
నక్కపల్లి : ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు టీటీడీ సెక్యూరిటీ గార్డులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డులు చంద్రరావు, లక్ష్మీనారాయణలను విధుల నుంచి తొలగిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసిందని గ్రూపు దేవాలయాల సూపరింటెండెంట్ వెంకటరమణ విలేకరులకు తెలిపారు. మంగళవారం రాత్రి ఆలయంలో ఇద్దరు దుండగులు ప్రవేశించి హుండీలను పగుల గొట్టి లక్షలాది రూపాయలు అపహరించిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు ఒకరు ఆలయ బయట, మరొకరు సీసీ కెమెరాల రూములో పడుకున్నారు. వీరి నిర్లక్ష్యం వల్లే చోరీ జరిగిందని గుర్తించిన టీటీడీ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ సంస్థ తరపున పనిచేస్తున్న ఇద్దరిని తొలగించినట్టు ఆయన చెప్పారు.


