దగా పాలనకు రెండేళ్లు! | - | Sakshi
Sakshi News home page

దగా పాలనకు రెండేళ్లు!

Jun 3 2026 12:33 AM | Updated on Jun 3 2026 12:33 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2026

ఎంఎస్‌ఎంఈ పార్కుకు మరో 100 ఎకరాలు ?

మాకవరపాలెం: మండలంలోని రాచపల్లి రెవెన్యూలో మరో 100 ఎరకరాల భూ సేకరణకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెవెన్యూలోని 737 సర్వే నంబర్‌లో ఇప్పటికే ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు 406 ఎకరాల భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఆనుకుని ఉన్న మరో 100 ఎకరాల వరకు భూమిని సేకరించనున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా గత మూడు రోజులుగా స్థానిక రెవెన్యూ సిబ్బంది సర్వే చేపట్టారు. గతంలో రైతులు సాగులోని ఆక్రమణ భూములు మాత్రమే తీసుకుని ఎకరానికి రూ.9 లక్షల చొప్పున పరిహారం అందించారు. ప్రస్తుతం వెంకయ్యపాలెం, చినరాచపల్లి ప్రాంతంలో ఉన్న జిరాయితీ భూములను మాత్రమే మంగళవారం సర్వే చేస్తున్నారు. దీంతో సుమారు 100 ఎకరాల వరకు జిరాయితీ భూమిని సేకరిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే విషయమై రాచపల్లి వీఆర్వో సాంబశివరావును సంప్రదించగా ఉన్నతాధికారుల ఆదేశాలతో జిరాయితీ భూములు మాత్రమే సర్వే చేస్తున్నట్టు చెప్పారు.

అనకాపల్లి : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల నడ్డి విరిచారని, సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనట్టు పశ్చిమగోదావరి జిల్లా రిజనల్‌ కో ఆర్డినేటర్‌, చోడవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు.

పథకాలపై బాబు డాబు...

సార్వత్రిక ఎన్నికల హామీల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రెండేళ్ల పాలనలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3వేలు, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజ్‌ రియంబర్స్‌మెంట్‌, వృద్ధులకు ప్రభుత్వ ఫించన్‌, 50 సంవత్సరాల బీసీలకు ప్రభుత్వ పింఛన్‌లు, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు గురించి ప్రజలు అడుగుతుంటే పూర్తిస్థాయిలో అమలు చేయడం జరిగిందని, సూపర్‌సిక్స్‌ సూపర్‌ హిట్‌ అని చెప్పుకోవడంతో ప్రజలు నవ్వుతున్నారని పేర్కొన్నారు.

కూటమి మోసాలపై నిరసనలు

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు వివరించేందుకే ఈ నెల 4 నుంచి 12 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు స్థానిక ప్రజల సహకారంతో చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను దొడ్డిదారిన అమ్మకుని, మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్‌కే దక్కిందన్నారు. దరఖాస్తు పెట్టుకుంటే చాలు అర్హతతో సంబంధం లేకుండా రూ.15 లక్షలు చెల్లిస్తే పేకాటలో ప్రావీణ్యం ఉంటే చాలు స్సోర్ట్స్‌ కోటాల్లో ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో వస్తాయన్నారు. హోంమంత్రి అనిత కూటమి పాలనలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అందరూ హోంమంత్రికి దరఖాస్తులు చేసుకుని ఉద్యోగాలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు. నిరుద్యోగ యువతకు పార్టీ అండగా నిలబడుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనకు..నేటి పాలనకు ఉన్న తేడాలను ప్రజలు గమనించారని, అవకాశం రాగానే కూటమికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల సమన్వయకర్తలు మలసాల భరత్‌కుమార్‌, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, కంబాల జోగులు, పార్లమెంట్‌ పరిశీలకురాలు శోభా హైమావతి, ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ, నియోజకవర్గ పరిశీలకులు సతీష్‌వర్మ, గండి రవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌, అనకాపల్లి, కశింకోట మండలపార్టీ అధ్యక్షులు పెదిశెట్టి గోవింద, మలసాల కిషోర్‌, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు, 80,81,82,83, 84 కెఎం.నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, అల్లు త్రినాథ్‌, బుద్ద భాస్కరరావు, పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

‘సూపర్‌సిక్స్‌’ అమలులో కూటమి ఫెయిల్‌

మోసపూరిత హామీలతోజనం నడ్డి విరిచారు

ప్రజలకు వెన్నుపోటు పొడిచారు

పోస్టర్‌ ఆవిష్కరించినవైఎస్సార్‌సీపీ నేతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement