తమ ఫోన్ నంబర్లు ప్రెవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఎలా వేళ్లాయో అర్థం కావడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వస్తున్న ఫోన్ కాల్స్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అలాగే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా అడ్మిషన్లు పేరిట ఫోన్ కాల్స్ రాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలి.
– జామి సీతారామయ్య, అనకాపల్లి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పర్సనల్ డేటా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల చేతుల్లోకి ఎలా చేరుతుందో విద్యాశాఖ సమాధానం చెప్పాలి. ఫీజు రాయితీల పేరిట తల్లిదండ్రులను పదే పదే ఫోన్స్ కాల్స్‌తో ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
– జి. ఫణీంద్ర కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి


