నక్కపల్లి: స్పెషల్ ఇంటెన్సివ్ రిజిజన్(సర్)పేరుతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లను తొలగించేందుకు అధికార పక్షపార్టీలు తెరతీశాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ స్థాయి బీఎల్‌ఏల శిక్షణ కార్యక్రమం శనివారం నక్కపల్లి సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కంబాల జోగులు ఽఅధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ ఇటీవల లక్షల్లో ఓట్లు తొలగించడం వల్ల పలు రాష్ట్రాల్లో పార్టీలు అధికారాన్ని కోల్పోయాయన్నారు. పదేళ్లనుంచి వరుసగా ఓటుహక్కు వినియోగించుకున్నవారి ఓట్లు కూడా ఈ రివిజన్‌పేరుతో తొలగించారని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష పార్టీ ఓట్లను భారీగా తొలగిస్తున్నారన్నారు. ఈ స్పెషల్‌రివిజన్‌పేరుతో ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ చాలా సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. గతంలో పార్టీ తరఫున ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక కన్వీనర్‌ను నియమించామని, తాజాగా వారికి సహాయకులుగా ప్రతి బూత్‌కు మరో బూత్ ఏజెంట్‌ను నియమించినట్టు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్ల తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు ప్రణాళిక రూపొందించారన్నారు. అందువల్ల ప్రతి బీఎల్‌ఏ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల రివిజన్‌సమయంలో అధికారులు అడిగిన డిక్లరేషన్ ఫారాలను కచ్చితంగా అందజేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ ముఖ్యనాయకులు, మండల, పార్టీ జిల్లా సీనియర్ నాయకుల సహాయం తీసుకోవాలన్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. తాత్కాలికంగా వలస వెళ్లిన వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారన్నారు. ఉపాధి కోసం నెల,రెండునెలలు ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి ఓట్లు ప్రధాన గ్రామం నుంచి కొత్తగా ఏర్పాటయిన జగనన్న కాలనీలకు వెళ్లిన వారి ఓట్లు కూడా తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎస్‌ఐఆర్‌పై పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే పలు సలహాలు సూచనలు చేశారని చెప్పారు. అన్యాయంగా ఓట్లుతొలగిస్తే అటువంటి వారి పేర్లతోకూడిన జాబితాలు కలెక్టర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేయాలన్నారు. కంబాలజోగులు,డి.వి.సూర్యనారాయణరాజు తదితరులు మాట్లాడుతూ ఈ ఓటర్ల రివిజన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మద్దతు దారుల ఓట్లు రద్దచేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనే సత్తాలేక ఇటువంటి వాటి ద్వారా అధికారానికి దూరం చేయాలనే కుట్రజరుగుతోందన్నారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్రకార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, నియోజకవర్గ పరిశీలకులు దంతులూరి దిలిప్‌కుమార్, పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు గొర్ల గోవిందరావు, మధు వర్మ, గెడ్డమూరి శ్రీనివాసరావు,పైలా రమేష్,పార్టీ జిల్లాప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, ఎంపీపీలు ఏనుగుపల్లిరత్నం, జెడ్పీటీసీలు గోసలకాసులమ్మ, లంక సూరిబాబు, సిద్దాబత్తుల ఉమాదేవి,వైస్‌ఎంపీపీ వెలగ ఈశ్వరరావు, బూత్‌కమిటీల రాష్ట్రకార్యదర్శి గొర్ల బాబూరావు,వైఎస్సార్‌సీసీ ఐటీ వింగ్ ప్రతినిధి కొమ్ము శ్రీనివాసరావు, సీనియర్‌నాయకులు లొడగల చంద్రరావు, జగతా శ్రీను,పొడగట్ట పాపారావు, చోడిపల్లి అప్పన్న,పోశిన నరేష్,విద్యార్థి విబాగం అధ్యక్షుడుయలమంచిలి చందు, ప్రచార విబాగం అధ్యక్షుడు కొప్పిశెట్టి హరి, రైతువిభాగం కార్యదర్శి సూరాకాసుల గోవిందు,వాణిజ్యవిబాగం అధ్యక్షుడు వైసత్తిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కే వెంకటరావు దనిశెట్టిబాబి తదితరులు పాల్గొన్నారు,
మాట్లాడుతున్న సమన్వయకర్త కంబాల జోగులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి


