నిరసనాగ్రహం | - | Sakshi
Sakshi News home page

నిరసనాగ్రహం

May 30 2026 12:23 AM | Updated on May 30 2026 12:23 AM

దగా డీఎస్సీపై
సీబీఐ, విశ్రాంత హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబు, లోకేష్‌ ఒక్కో ఉద్యోగాన్ని రూ. 15 లక్షలకు అమ్ముకున్నారు జూన్‌ 1న కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మహా ధర్నా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన

అనకాపల్లి:

మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీకి తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం యుద్ధం ప్రకటించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వైఖరిని నిరసిస్తూ.. అనకాపల్లిలో శుక్రవారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ మెగా డీఎస్సీని అవినీతిమయమైన దగా డీఎస్సీగా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసిందని తీవ్రంగా ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లు చెలగాటం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల ప్రతిభను పక్కనబెట్టి, ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. డీఎస్సీలో మెగా స్కామ్‌ జరిగిందని, విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం స్థానిక రింగ్‌ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి భీమునిగుమ్మం కూడలి వరకు పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ..మెగా డీఎస్సీలో జరిగిన భారీ అక్రమాలపై రాష్ట్ర గవర్నర్‌ స్పందించి సీబీఐ, హైకోర్టు న్యాయమూర్తితో తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. పరీక్షల్లో అర్హత సాధించిన నిరుద్యోగులను పక్కనబెట్టి మంత్రి లోకేష్‌కు భారీగా ముడుపులు చెల్లించిన వారికే ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. ఈ అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది నిరుద్యోగులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు, నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేకుండా, రూపాయి ఖర్చు కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండు లక్షల మందికి పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని, నిరుద్యోగులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా జూన్‌ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల పొట్టకొడుతోందని, డీఎస్సీ పేపర్‌ లీకేజీ నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కష్టపడి చదివిన అభ్యర్థులను కాదని, రూ. 15 లక్షలకు ఉద్యోగాలను అమ్ముకున్న ఏ ప్రభుత్వమూ చరిత్రలో నిలబడలేదన్నారు. నగదు కొట్టు.. జాబ్‌ పట్టు అనేలా విద్యాశాఖ మంత్రి గ్రూపుల్లో హల్‌చల్‌ చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌, 80,81,84 వార్డు ఇన్‌చార్జులు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల విద్యార్థుల విభాగం అధ్యక్షులు యలమంచిలి చందు, కిల్లాడ శ్రీనివాసరావు, బాలు యాదవ్‌, పోతల జగదీష్‌, పార్టీ సీనియర్‌ నాయకులు బుదిరెడ్డి దేముడుబాబు, కిట్టు, పెదిశెట్టి గోవింద్‌, త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement