కలెక్టర్ నిశాంతి ఆదేశం
పాడేరు: విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో సోమవారం కలెక్టరేట్‌లో స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభవంతుల నుంచి కలెక్టర్ నిశాంతి 15 అర్జీలు స్వీకరించారు. అనంతరం పలువురు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణిస శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్‌చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, డీఎల్‌పీవో కుమార్, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ కె.కవిత, పలువురు అధికారులు పాల్గొన్నారు.


