పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పనపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పనపై దృష్టి

Jun 16 2026 12:16 AM | Updated on Jun 16 2026 12:16 AM

జి.మాడుగుల: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై హెచ్‌ఎంలు దృష్టి సారించాలని అడిషనల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ కె. స్వామినాయుడు సూచించారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో సోమవారం మన బడి– మన భవిష్యత్తుపై మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు, సీఎంఏ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో పాఠశాలలకు మంజూరైన మౌలిక సదుపాయాల గురించి హెచ్‌ఎంలకు వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుల కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పాత్రుడు,డీఆర్‌పీ మౌళి, ఎంఈవో బాబూరావుపడాల్‌, ఎంఈవో–2 వెంకటరమణమూర్తి, మండల ఇంజినీరింగ్‌ అధికారి మాణిక్యం,ఆశ్రమపాఠశాల హెచ్‌ఎం బాలరాజు,సీఆర్‌పీలు, పలు పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement