ప్రత్యేక రైళ్లు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Jun 16 2026 12:16 AM | Updated on Jun 16 2026 12:16 AM

తాటిచెట్లపాలెం(విశాఖ): విశాఖప ట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం, విశాఖపట్నం–షాలిమర్‌– విశాఖపట్నం మధ్య నడుస్తున్న స్పెషల్‌ రైళ్లు మరికొంత కాలం పొడిగించినట్లు సౌత్‌ కోస్ట్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ వై.బాలాజి కిరణ్‌ తెలిపారు. విశాఖలో ప్రతీ మంగళవారం బయలుదేరే విశాఖపట్నం–షాలిమర్‌(08508) స్పెషల్‌ రైలు సెప్టెంబరు 29వ తేదీ వరకు, షాలిమర్‌లో ప్రతీ బుధవారం బయలుదేరే షాలిమర్‌–విశాఖపట్నం (08507) స్పెషల్‌ సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించారు. విశాఖలో ప్రతీ శుక్రవారం బయలుదేరే విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు(08581) వీక్లీ స్పెషల్‌ సెప్టెంబరు 25వ తేదీ వరకు, ఎస్‌ఎంవీ బెంగళూరులో ప్రతీ శనివారం బయలుదేరే ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం (08581) వీక్లీ స్పెషల్‌ సెప్టెంబరు 26వ తేదీ వరకు పొడిగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement