చింతపల్లి: చింతపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్లు పరిధిలో నూతనంగా అంగన్‌వాడీ వర్కర్లుకు నేటి నుంచి కాల్ లెటర్లు పంపిణీ చేయనున్నట్టు సీడీపీవో శ్రీదేవి తెలిపారు. మండల వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 45 కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్లు పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరించినట్టు చెప్పారు. పీఎం జన్‌మన్ పథకంలో మంజూరైన చాడీపేట, రాళ్లగెడ్డ కొత్తూరు గ్రామాలకు మినహా మిగిలిన అన్ని కేంద్రాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో కాల్‌లెటర్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 17న పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఇంటర్యూలకు కాల్ లెటర్సుతో అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.


