చింతపల్లి: చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలోని రైతులకు ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నట్టు వ్యవవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తిరుమలరావు తెలిపారు. గత ఏడాది రైతులు నమోదు చేసుకున్న ఈ–క్రాప్‌లో ఎటువంటి తప్పొప్పులు ఉన్నా, వాటిని ఈ ఏడాది ఈ యాప్ ద్వారా సరిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో నమోదైన పంటల్లో మార్పులు చేసుకున్నా, ఆధార్ అనుసంధానం కాకపోయినా, రైతు మొత్తం విస్తీర్ణం నమోదు కాకపోయినా ఈ యాప్ ద్వారా రైతు సేవా కేంద్రంలో సరిచేసుకోవచ్చున్నారు. ఈ సంవత్సరం మీ పంటకు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరవులను మూడుసార్లు 20 రోజుల వ్యవధిలో పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.వ్యవసాయ భూమి, కౌలు రైతులకు మాత్రమే అందజేస్తామన్నారు. రైతులు విదిగా ఏపీఏఐఎంఎస్ యాప్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.


